దుబాయ్: భారత మహిళల జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు దూసుకెళ్లింది. ఇటీవల ముగిసిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో రాణించిన మంధాన.. ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని 721 రేటింగ్ పాయింట్లతో సెకండ్ ప్లేస్‌కు ఎగబాకింది. సౌతాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ 738 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
2019లో ఒకసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించిన మంధాన.. రాబోయే సిరీస్‌లలో ఇదే జోరు కొనసాగిస్తే మొదటి ర్యాంక్‌కు చేరుకోవడం కష్టమేమీ కాదు.