ICC Women’s T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో పోరాడి ఓడిన భారత్.. ఫైనల్లో ఆస్ట్రేలియా
ICC Women's T20 World Cup | దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. సెమీస్‌లో భారత మహిళ జట్టు పోరాడి ఓడిపోయింది. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హర్మన్‌ప్రీత్ (52), జెమీమా (43), దీప్తిశర్మ (20) రాణించినా ఓటమి తప్పలేదు.
ICC Women’s T20 World Cup | దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. సెమీస్‌లో భారత మహిళ జట్టు పోరాడి ఓడిపోయింది. ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హర్మన్‌ప్రీత్ (52), జెమీమా (43), దీప్తిశర్మ (20) రాణించినా ఓటమి తప్పలేదు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. బెత్‌మూని (54), మెగ్ లన్నింగ్ (49), ఆష్లీ గార్డనర్ (31) రాణించడంతో ఆస్ట్రేలియా భారీ సోర్కు సాధించింది.
భారత బౌలర్లలో షికా పాండేకు రెండు వికెట్లు, దీప్తిశర్మ, రాధా యాదవ్‌కు చెరో వికెట్ దక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. కీలకమైన మ్యాచ్‌లో ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానా, యాషిక భాటియా తక్కువ సోరుకే వెనుదిరిగారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ ఆదుకున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో 54 పరుగులతో రాణించింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ రనౌట్‌గా వెనుదిరిగింది. జెమీమా రొడ్రిగ్స్ 43 (24) పరుగులు చేసింది. చివరకు దీప్తి శర్మ 17 బంతుల్లో 20 పరుగులతో రాణించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ కేవలం 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసింది. అలాగే ఆష్లీ గార్డనర్‌కు మరో రెండు వికెట్లు దక్కాయి. మేఘన్ స్కాట్, జెస్ జోనాస్సెన్కు చెరో వికెట్ దక్కాయి. సెమీస్‌లో భారత్‌పై గెలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

