రాణి రాంపాల్ లేకుండానే..
- ప్రపంచకప్ టోర్నీకి భారత మహిళల హాకీ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ లేకుండానే భారత మహిళల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్‌లో బరిలోకి దిగనుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో హాకీ ఇండియా(హెచ్ఐ) ఆమె పేరు లేకుండా మంగళవారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి 17 వరకు నెదర్లాండ్స్, స్పెయిన్‌లో జరుగనున్న మెగాటోర్నీలో బరిలోకి దిగనున్న అమ్మాయిల బృందానికి గోల్‌కీపర్ సవిత పునియా సారథ్యం వహించనున్నది. ‘రాణి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు.
అందుకే ఆమె పేరు పరిగణనలోకి తీసుకోలేదు. తాజా ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేశాం. అనుభవజ్ఞులతో పాటు, యువ ఆటగాళ్లతో కూడిన జట్టు సమతూకంగా ఉంది’అని హెడ్‌కోచ్ షాప్‌మన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, చైనాతో కలిసి పూల్-‘బి’లో ఉన్న భారత్.. జూలై 3న ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. గత ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఓటమి పాలైన భారత్.. ఈసారి పతకం నెగ్గాలని కృతనిశ్చయంతో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

