భువనేశ్వర్: స్వదేశం వేదికగా జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రొలీగ్‌లో భారత మహిళల హాకీ జట్టు అదిరిపోయే విజయంతో ఆకట్టుకుంది. శనివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 3-2తో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది.
తమ(9) కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్(7)ను భార త్ మెరుగ్గా నిలువరించింది. వైష్ణవి ఫాల్కె(6ని), దీపిక(25ని) పెనాల్టీ కార్నర్ గోల్స్ చేయగా, మ్యాచ్ ఆఖరి నిమిషంలో నవనీత్‌కౌర్(59ని) గోల్‌తో భారత్ విజ యం ఖరారైంది. డార్కీ బౌర్నె(12ని), ఫి యోనా క్రాకల్స్(58ని) ఇంగ్లండ్‌కు గోల్స్ అందించారు.
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్‌లో ఓవైపు అమ్మాయిలు అదరగొడుతుంటే..అబ్బాయిలు పేలవ ప్రదర్శన కనబరిచారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-3 తేడాతో స్పెయిన్ చేతిలో ఓటమిపాలైంది.