Guguloth Soumya | న్యూఢిల్లీ: తెలంగాణ యువ ఫుట్‌బాల్ ప్లేయర్ గుగులోత్ సౌమ్య సూపర్ గోల్‌తో సత్తాచాటడంతో భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు హాంకాంగ్‌పై విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 2-0తో హాంకాంగ్‌పై గెలుపొందింది. భారత్ తరఫున సౌమ్య (80వ నిమిషంలో), అంజు తమాంగ్ (19వ ని.లో) చెరో గోల్ కొట్టారు.