ఇందూరు: ఆసియాకప్ సన్నాహాల్లో భాగంగా భారత మహిళల సీనియర్ ఫుట్బాల్ జట్టు బ్రెజిల్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఇందులో భాగంగా చీఫ్ కోచ్ థామస్ డేనర్బై శుక్రవారం 23 మందితో ఎంపిక చేసిన జట్టులో ఇందూరు ప్లేయర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. వరుస టోర్నీల్లో భారత్ తరఫున రాణిస్తున్న సౌమ్య జట్టులో కీలక ప్లేయర్గా ఎదిగింది. పర్యటనలో భాగంగా ఈనెల 25న బ్రెజిల్తో, చిలీ(28న), వెనిజులా(డిసెంబర్ 1)తో టీమ్ఇండియా మ్యాచ్లు ఆడనుంది. దేశ జట్టుకు సౌమ్య వరుసగా ఎంపిక కావడం రాష్ర్టానికి గర్వకారణమని కేర్ ఫుట్బాల్ అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. భవిష్యత్లో సౌమ్య మరిన్ని విజయాలు సాధించాలని ఆమె కోచ్ నాగరాజు ఆకాంక్షించారు.