న్యూఢిల్లీ: భారత యువ వెయిట్‌లిఫ్టర్ భరలి బేదబ్రతె అల్బేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 15 ఏళ్ల భరలి 67 కిలోల విభాగంలో మొత్తం 267 కిలోల (స్నాచ్ 119కి., క్లీన్ అండ్ జర్క్ 148కి.)తో మూడో స్థానంలో నిలిచాడు. అర్మేనియాకు చెందిన సెర్యోజ బర్సెగ్యాన్ 275 (128+147) కిలోలతో స్వర్ణం, సౌదీ అరేబియాకు చెందిన మొహమ్మద్ అల్ మర్జాఖ్ 270 (119+148) కిలోలతో రజతం గెలుచుకున్నారు. భరలి క్లీన్ అండ్ జర్క్ విభాగంలో రజతం గెలుచుకున్నాడు. ఈ విభాగంలో మొత్తం, స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో ప్రపంచ రికార్డులు మన దేశానికే చెందిన జెరెమి లాల్రినుంగ పేరిట ఉన్నాయి. కాగా మహిళల 49 కిలోల విభాగంలో కోయల్ బార్ (144=64+80) 9వ స్థానంలో, 55 కిలోల విభాగంలో మినా శాంత (153 =70+83) 13వ స్థానంలో నిలిచారు.