షాంఘై: భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహాన్ బోపన్న షాంఘై మాస్టర్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట 7-5, 2-6, 7-10తో మార్కెల్ గ్రానొల్లర్స్-హొరాకియో జెబల్లాస్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం నెగ్గిన 43 ఏండ్ల బోపన్న.. ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో జరుగనున్న ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.