ధవన్ కెప్టెన్

- శ్రీలంక టూర్కు భారత జట్టు ఎంపిక
ముంబై: శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు సీనియర్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ సారథ్యం వహించనున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలోని భారత ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న తరుణంలో లంకతో పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగనుండడంతో ఈ టీమ్ఇండియా-2 కొత్త ఆటగాళ్లతో కళకళలాడుతున్నది. జూలై 13 నుంచి 25 మధ్య శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లకు 20 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్టర్లు గురువారం ప్రకటించారు. కెప్టెన్గా ధవన్, ఉపసారథిగా స్టార్ బౌలర్ భువనేశ్వర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఐపీఎల్లో అదరగొట్టిన దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా, రుతురాజ్ గైక్వాడ్, కృష్ణప్ప గౌతమ్, నితీశ్ రాణా, చక్రవర్తి లాంటి కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కగా.. పృథ్వీషా, కుల్దీప్ యాదవ్, చాహల్ పునరాగమనం చేశారు.
భారత జట్టు: ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ (వైస్ కెప్టెన్), పృథ్వీషా, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, శాంసన్, చాహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చాహర్, సైనీ, చేతన్ సకారియా
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

