దుబాయ్: టీమిండియా క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి అయిదేళ్ల కాల పరిమితి ముగిసింది. టీ20 వరల్డ్‌కప్‌లో నమీబియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లతో రవిశాస్త్రి ముచ్చటించారు. ఆటగాళ్లలో తన మాటలతో ఉత్తేజపరిచారు. ప్రస్తుత జట్టు తన అంచనాలకు మించి ప్రదర్శించినట్లు రవిశాస్త్రి తెలిపారు. క్రికెట్ చరిత్రలో ఇదో అత్యుత్తమ జట్టు అని అన్నారు. ఇండియాకు త్వరలోనే వరల్డ్ కప్ టైటిల్ దక్కుతుందని శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇదో గొప్ప క్రికెట్ జట్టు అని అనడంలేదని, కానీ క్రికెట్ చరిత్రలో ఇదో గొప్ప జట్టుగా మిగిలిపోతుందన్నారు. జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, వాళ్లంతా ఫిట్‌గా, ఆకలితో, నిర్భయంగా, నాణ్యత కలిగి ఉన్నట్లు శాస్త్రి తెలిపారు. మరో అయిదేళ్ల పాటు ప్రపంచ పర్యటన చేసి అద్భుతమైన ఆటను ప్రదర్శించే ఆటగాళ్లు ఉన్నట్లు రవిశాస్త్రి తెలిపారు.
టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డేరింగ్ ఆట మిస్సైందని, కానీ ఈ టోర్నీతో యువకులు ఎంతో నేర్చుకున్నారని, మళ్లీ వాళ్లకు వచ్చే ఏడాది అవకాశం వస్తుందని రవిశాస్త్రి తెలిపారు. 12 నెలల వ్యవధిలో మళ్లీ వరల్డ్‌కప్ రావడం అరుదు అని, బహుశా ఆ టోర్నీలో రాణిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మళ్లీ ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్ ఉన్న విషయం తెలిసిందే. కరోనా వేళ ఆటగాళ్లు బయోబబుల్ వత్తిడికి లోనైట్లు తెలిపారు. గత రెండేళ్ల నుంచి కొందరు ఆటగాళ్లు కేవలం 25 రోజులు మాత్రమే ఇంటి వద్ద ఉండిపోయినట్లు ఆయన చెప్పారు. బయోబబుల్ వాతావరణంలో బ్రాడ్‌మ్యాన్ సగటు కూడా క్షీణిస్తుందని రవిశాస్త్రి అన్నారు.
Must Watch: A stirring speech to sign off as the #TeamIndia Head Coach 👏 👏
— BCCI (@BCCI) November 9, 2021
Here's a snippet from @RaviShastriOfc's team address in the dressing room, reflecting on the team's journey in the last few years. 👍 👍 #T20WorldCup #INDvNAM
Watch 🎥 🔽https://t.co/x05bg0dLKH pic.twitter.com/IlUIVxg6wp