మకావు: ఉషూ సాండా ప్రపంచకప్లో భారత ఉషూ క్రీడాకారులు సత్తాచాటారు. ఆరుగురి బృందంతో ఈ టోర్నీలో పాల్గొన్న భారత్.. రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో మెరిసింది. మహిళల 75 కిలోల విభాగంలో శివాని.. 52 కిలోల క్యాటగిరీలో అపర్ణ పసిడి పతకాలు నెగ్గగా 48 కేజీల ఫైనల్లో ఓడిన కుషాల్ కుమార్ రజతంతో సరిపెట్టుకున్నాడు. కరీనా కౌశిక్, సాగర్ దహియా కాంస్యాలు గెలుచుకున్నారు. ఈ టోర్నీలో 5 పతకాలతో భారత్ మూడో స్థానంలో నిలిచింది.