ఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. మూడుసార్లు ఒలింపియన్ అయిన వినేశ్.. పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాములు అదనపు బరువు ఉండటంతో కీలక సమరానికి ముందు అనర్హత వేటుకు గురైన తర్వాత ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే సుమారు ఏడాదిన్నర తర్వాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2028లో జరుగబోయే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతానని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.