Vinesh Phogat | భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్ హుడాను వినేశ్ మర్యాదపూర్వకంగా కలుసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువతో అనర్హత వేటుకు గురైన వినేశ్‌కు.. స్వదేశంలో ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే.
మాంచెస్టర్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న శ్రీలంక తొలి టెస్టులో ఎదురీదుతోంది. ఆతిథ్య జట్టును 358 పరుగులకే ఆలౌట్ చేసిన లంకేయులు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ మూడో రోజు 53 ఓవర్లలో 182/5 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 122 పరుగుల కీలక ఆధిక్యం దక్కించుకుంది. ఆ జట్టు తరఫున యువ వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ (111) సెంచరీతో చెలరేగాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో లంక ఒక్క పరుగు వద్దే ఓపెనర్ నిషాన్, కుశాల్ వికెట్లను కో ల్పోయింది. 95 పరుగులకే 4 వికె ట్లు కోల్పోయిన ఆ జట్టును సీనియర్ బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ (65), క మిందు మెండిస్ (48 నాటౌట్) ఆదుకున్నారు. అయితే మాథ్యూస్‌ను పాట్స్ ఔట్ చేయడంతో లంక కష్టాలు రెట్టింపయ్యాయి. మూడో రోజు 53 ఓవర్ల ఆట ముగిసేసరికి లంక 60 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.
1 ఈ మిలీనియంలో సెంచరీ చేసిన తొలి ఇంగ్లండ్ వికెట్‌కీపర్, బ్యాటర్‌గా జెమీ స్మిత్ (24 ఏండ్ల 40 రోజులు) రికార్డుల్లోకెక్కాడు.