Prannoy | న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ ప్రణయ్‌కు కొరియా ఓపెన్‌లో నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గురువారం ఐదో సీడ్ ప్రణయ్ 15-21, 21-19, 18-21తో లీ చెక్ యూ చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-17, 21-15తో హె జి టింగ్, హో డాంగ్ ద్వయంపై గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీ, మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్ జంట పరాజయం పాలయ్యాయి.