హైదరాబాద్, ఆట ప్రతినిధి: బౌల్డర్హిల్స్ క్లాసిక్ గోల్ఫ్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ శుభాంకర్శర్మ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. గచ్చిబౌలి బౌల్డర్హిల్స్, కంట్రీ క్లబ్ వేదికగా జరుగుతున్న టోర్నీ రెండో రౌండ్లో శుభాంకర్ అండర్ 66 స్కోరు నమోదుతో రెండు షాట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.
ఇప్పటికే ఆరుసార్లు డీపీ వరల్డ్ పీజీటీఏ విజేతగా నిలిచిన శుభాంకర్ అద్భుతమైన ప్రదర్శనతో 12 అండర్ 132 స్కోరుతో లీడర్బోర్డులో అగ్రస్థానానికి చేరుకున్నాడు. మరోవైపు కోల్కతాకు చెందిన 36 ఏండ్ల దివ్యాంశు బజాజ్ 10 అండర్ 134 స్కోరుతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. హైదరాబాద్ గోల్ఫర్ విశేష్శర్మ 9 అండర్ 135 స్కోరుతో మూడో స్థానానికి పడిపోయాడు.