మాంటెపెలియర్ (ఫ్రాన్స్): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) చాంపియన్స్ టోర్నీలో భారత స్టార్ ప్యాడ్లర్ మనిక బత్రా పోరా టం క్వార్టర్స్‌లోనే ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో మనిక.. 8-11, 8-11, 10-12తో క్వియాన్ టియాన్యి (చైనా) చేతిలో అపజయం పాలైంది. 25 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో టియాన్యి జోరు ముందు మనికా నిలవలేకపోయింది. ఈ టోర్నీలో క్వార్టర్స్ చేరిన తొలి భారత ప్యాడ్లర్‌గా రికార్డులకెక్కిన ఆమె.. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ బెర్నాడట్టె (రొమానియా)ను ఓడించినా కీలక మ్యాచ్‌లో ఓడింది.