ఒర్లీన్స్: ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఒర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రౌండ్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి.
తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, అయూశ్ శెట్టి గెలిచి ముందంజ వేయగా కిరణ్ జార్జి, మాళవిక బన్సోద్, ఉన్నతి హుడా పోరాటం మొదటి రౌండ్లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-19, 21-14తో టకహాషి (జపాన్)ను ఓడించగా ప్రణయ్ 21-11, 20-22, 21-9తో వాంగ్ జు (చైనీస్ తైపీ)పై గెలిచాడు.