కైరో: ఒలింపియన్ గురుప్రీత్ సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజతంతో మెరిశాడు. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టోల్ ఈవెంట్ ఫైనల్లో గురుప్రీత్.. రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గగా ఉక్రెయిన్ షూటర్ పావ్లొ కొరొైస్టెలోవ్ స్వర్ణం సాధించాడు.
కాగా గురుప్రీత్ పతకంతో ఈ టోర్నీలో భారత జట్టు 13 పతకాల (3 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్యాలు)తో మూడో స్థానంలో నిలిచింది. చైనా, దక్షిణకొరియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ మూడు పతకాలు గెలవడం గమనార్హం.