అల్మాటీ (కజకిస్థాన్): ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షాట్‌గన్ స్కీట్ విభాగంలో భారత షూటర్లు మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచారు. సోమవారం జరిగిన తొలి రోజు పోటీలు ముగిసేసరికి భారత షూటర్లు వెనుకంజలో నిలిచారు. మహిళల విభాగంలో చండీగఢ్‌కు చెందిన గనేమత్ మాత్రమే 75 లక్ష్యాలకు గాను 70 పాయింట్లు సాధించి 9వ స్థానంలో నిలిచి ఫైనల్ రేసులో ఉంది.
పురుషుల స్కీట్ విభాగంలో సీనియర్ షూటర్ మెరాజ్ అహ్మద్ 71 పాయింట్లతో 27వ స్థానంలో నిలిచాడు. గుర్జోత్ సింగ్ ఖంగురా (70 పాయింట్లు) 33వ స్థానం లో ఉండగా.. అనంత్‌జీత్ సింగ్ 69 పాయింట్లతో నిరాశ పరిచాడు.