న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. శనివారం జరిగిన 10మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ద్వయం రశ్మిక సెహగల్, కపిల్ 16-10తో మన దేశానికే చెందిన వంశిక చౌదరీ, జొనాథన్ జోడీపై గెలిచి పసిడి కైవసం చేసుకుంది. మహిళల స్కీట్ ఫైనల్లో రైజా థిల్లాన్(51) రజత పతకంతో మెరిసింది.