జకార్తా: భారత షూటర్ విజయ్‌వీర్ సిద్ధు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో రజత పతకం సాధించడం ద్వారా విజయ్‌వీర్ విశ్వక్రీడలకు అర్హత సాధించాడు.
దీంతో పారిస్ విశ్వక్రీడల షూటింగ్లో భారత్ బెర్తుల సంఖ్య 17కు చేరుకుంది. శనివారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో 21 ఏండ్ల విజయ్‌వీర్ రెండో స్థానంలో నిలిచాడు.