న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే రజత పతకం కైవసం చేసుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత షూటర్ ఫైనల్లో తడబడ్డాడు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్స్ ఈవెంట్ ఫైనల్లో 10-16 తేడాతో సెర్హియ్ కులిశ్ (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచి రజతంతో సరిపెట్టుకోగా.. ఫిన్లాండ్ షూటర్ అలెక్సి కాంస్యం నెగ్గాడు. ర్యాంకింగ్ రౌండ్లో కులీశ్ 411 వద్ద షూట్ చేయగా.. స్వప్నిల్ 409.1, అలెక్సి 407.8 స్కోర్ చేశారు.