ఢిల్లీ: డోపింగ్ టెస్టులో విఫలమైనందుకు గాను భారత లాంగ్ డిస్టాన్స్ రన్నర్ అర్చన జాదవ్‌పై నాలుగేండ్ల నిషేధం పడింది.
2024 డిసెంబర్లో పుణె వేదికగా జరిగిన హాఫ్ మారథాన్ ఈవెంట్లో పాల్గొనే ముందు అర్చన నుంచి వాడా సేకరించిన నమూనాలలో నిషేధ ఉత్ప్రేరకం అయిన ఆక్సాన్డ్రోలొన్ వాడినట్టు తేలింది. ఆమెపై 2025 జనవరి 7 నుంచి నాలుగేండ్ల పాటు నిషేధాన్ని విధిస్తున్నట్టు ఏఐయూ తెలిపింది.