కాలిఫొర్నియా: ఇండియానా వెల్స్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ, తన సహచర ఆండ్రే గొరన్సన్ (స్వీడన్)తో కలిసి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.
పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో ఈ భారత, స్వీడన్ ద్వయం.. 3-6, 7-6 (7/5), 10-8తో జిలెన్స్కి (పోలండ్), సాండర్ గిల్లె (బెల్జియం) జంటను ఓడించింది. బాంబ్రీ జోడీ నేడు ప్రిక్వార్టర్స్ ఆడనుంది.