న్యూఢిల్లీ : భారత క్రీడా క్యాలెండర్లో మరో కొత్త లీగ్ చేరబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పికిల్‌బాల్ ఆట లీగ్ రూపంలో ముందుకు రాబోతున్నది. దేశంలో తొలి అధికారిక ఇండియన్ పికిల్‌బాల్ లీగ్(ఐపీబీఎల్) పోటీలు డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఐపీబీఎల్ పోటీలకు వేదిక కానుంది.
ఈ లీగ్‌కు ఇండియన్ పికిల్‌బాల్ అసోసియేషన్ (ఐపీఏ) అనుమతితో పాటు క్రీడా, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు లభించింది. తొలి ఎడిషన్‌లో దేశ విదేశాల నుంచి మేటి, వర్ధమాన ప్లేయర్లతో కూడిన జట్లు తలపడుతాయి. వారం రోజుల పాటు రౌండ్ రాబిన్, నాకౌట్ ఫార్మాట్లో మ్యాచ్‌లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. లీగ్ ప్రారంభంపై ఇండియన్ పికిల్‌బాల్ అసోసియేన్ అధ్యక్షుడు సూర్యవీర్సింగ్ హర్షం వ్యక్తం చేశారు.