ఢిల్లీ: ఇటీవలే పారిస్ వేదికగా ముగిసిన పారాలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఐదు పతకాలు అందించిన పారా షట్లర్లకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) రూ. 50 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. బ్యాడ్మింటన్ క్రీడలో భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు దక్కాయి. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 కేటగిరీలో బంగారు పతకం సాధించిన నితేశ్ కుమార్‌కు రూ. 15 లక్షలు దక్కగా వెండి కాంతులు పంచిన సుహాస్ యతిరాజ్ (ఎస్ఎల్ 4), తులసిమతి మురుగేశన్ (మహిళల సింగిల్స్ ఎస్‌యూ5)కు తలా రూ. 10 లక్షలు అందనున్నాయి. ఇక కాంస్యాలు సాధించిన అమ్మాయిలు మనీషా రామదాస్ (ఎస్‌యూ5), నిత్యశ్రీ శివన్ (ఎస్‌హెచ్6)కు తలా ఒక్కరికి రూ. 7.5 లక్షలు దక్కనున్నాయి.