దుబాయ్ : ఇండియన్ ఓపెనింగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ కెరీర్లో అత్యుత్తమ వన్డే ర్యాంకింగ్ సాధించాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్‌లో గిల్ నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. గిల్‌తోపాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాత్రమే టాప్‌టెన్‌లో చోటు దక్కించుకున్నారు. కోహ్లీ ఏడో ర్యాంక్, రోహిత్ ఎనిమిదో ర్యాంక్ పొందారు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ ఒక్కడే టాప్‌టెన్‌లో నిలిచి మూడో ర్యాం క్లో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్, కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అతనికంటే ముందున్నారు. టి20 బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.