CD Gopinath : భారత తొలితరం క్రికెటర్ సీడీ గోపినాథ్(CD Gopinath) కన్నుమూశాడు. 1952లో టీమిండియా తొలి టెస్టు గెలిచిన పదకొండు మందిలో ఒకడైన గోపిపాథ్ 96 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచాడు. గత కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన చెన్నై అడయార్‌లోని తన కూతురి నివాసంలో మరణించాడు. గోపినాథ్ మృతితో భారత క్రికెట్లో విషాదం నెలకొంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నిలకడగా రాణించి భారత జట్టుకు ఎంపికైన గోపినాథ్ విధ్వంసక ఆటగాడిగా పేరొందాడు. వీడ్కోలు అనంతరం ఆయన మేనేజర్, జాతీయ సెలెక్టర్‌గా సేవలందించాడు. భారత దిగ్గజాల్లో ఒకడైన గోపినాథ్ మరణించడంతో చంద్రకాంత్ పటన్కార్(95 ఏళ్లు) ప్రస్తుతానికి ప్రాణాలతో ఉన్న అతిపెద్ద వయస్కుడైన క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు.
CD Gopinath, the last surviving member of India’s first Test win, has died in Chennai at the age of 96.
He was India’s oldest living Test cricketer and the second oldest worldwide after Australia’s Neil Harvey pic.twitter.com/Tw0Bhuhfoo
— ESPNcricinfo (@ESPNcricinfo) April 9, 2026
తమిళనాడుకు చెందిన సీడీ గోపినాథ్ 1939, మార్చి 1వ తేదిన జన్మించాడు. 83 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకంతో, రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులతో మెరిశాడు. దాంతో, భారత్ ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది.
CD Gopinath, the last surviving member of India’s first Test win, has died in Chennai at the age of 96.
He was India’s oldest living Test cricketer and the second oldest worldwide after Australia’s Neil Harvey pic.twitter.com/Tw0Bhuhfoo
— ESPNcricinfo (@ESPNcricinfo) April 9, 2026
1952లో చెన్నైలో జరిగిన టెస్టులో భారత జట్టు సుదీర్ఘ ఫార్మాట్లో తొలి విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడిన గోపినాథ్.. మొత్తంగా ఎనిమిది టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 242 పరుగులు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 42.16 సగటుతో 4,259 రన్స్ సాధించాడు.