సిడ్నీ: భారత వన్డే క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆసీస్‌తో ఇటీవలే ముగిసిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ అయ్యర్‌కు పక్కటెముకల్లో అంతర్గత రక్తస్రావం అవడంతో అతడు సిడ్నీలో చికిత్స తీసుకుంటున్నాడు.ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీలోని స్పెషలిస్టులతో కలిసి అయ్యర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తున్నట్టు బోర్డు తెలిపింది.
అయ్యర్ పరిస్థితిపై వైద్యులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు పేర్కొంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాకే అతడు భారత్‌కు వచ్చే అవకాశముంది.