World Championships : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత మిక్స్డ్ ద్వయం తనీషా క్రాస్టో (Tanisha Crasto), ధ్రువ్ కపిల (Dhruv Kapila) జోడీ అద్భుత అవకాశాన్ని చేజార్చుకుంది. పదహారో రౌండ్లో ఐదో సీడ్ జంటపై సంచలన విజయంతో ఆశలు రేపిన ఈ జోడీ క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన పోరులో నాలుగో సీడ్ జంట చెన్ తంగ్జీ, తో ఇవీ(మలేషియా) చేతిలో పరాజయం పాలైంది భారత ద్వయం. దాంతో, ఈ టోర్నీలో పతకం గెలిచిన మూడో భారత జంటగా రికార్డు నెలకొల్పే అవకాశాన్ని చేజార్చుకున్నారు తనీషా, ధ్రువ్.
పారిస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ జోరుకు తెరపడింది. పదహారో రౌండ్లో ఐదో సీడ్ జంట టాంగ్ చున్ మన్, త్సె యింగ్ సుయెట్కు షాకిచ్చిన తనీషా, ధ్రువ్ జంట క్వార్టర్ ఫైనల్లో మాత్రం నిరాశపరిచింది. నాలుగో సీడ్ తంగ్జీ, ఇవీలను దీటుగా ఎదుర్కోలేకపోయింది.
Dhruv Kapila & Tanisha Crasto bow out in the quarterfinals at the #BWFWorldChampionships2025 💔
The Indian duo lose against Malaysia’s Chen Tang Jie & Toh Ee Wei in straight games.
Score: 15-21, 13-21#Badminton 🏸 pic.twitter.com/RA0pBPKiAw— The Bridge (@the_bridge_in) August 29, 2025
మ్యాచ్ ఆరంభంలో అదరగొట్టిన భారత ద్వయం ఆ తర్వాత తడబడింది. 37 నిమిషాల్లోనే ముగిసిన పోరులో 17-21, 13-21తో భారత జోడీ మ్యాచ్ చేజార్చుకుంది. తద్వారా.. ఈ పోటీల్లో చరిత్ర సృష్టించే అవకాశం చేజారింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్లో మనదేశం నుంచి అశ్వినీ పొన్నప్ప, జ్వాలా గుత్తా(2011), సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి(2022)లు మాత్రమే పతకం సాధించారు.