నింగ్బొ (చైనా): ప్రతిష్టాత్మక లో భారత్‌కు తొలిరోజే నిరాశజనక ఫలితాలు వచ్చాయి. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో భాగంగా బరిలోకి దిగిన మూడు మిక్స్డ్ డబుల్స్ జోడీల్లో ధృవ్ కపిల, తనీషా క్రాస్టొ ద్వయం మినహా మిగిలిన రెండు జంటలు మొదటి రౌండ్‌కే ఇంటిబాట పట్టాయి. తొలిరౌండ్లో ఈ భారత అత్యుత్తమ ర్యాంకు జంట.. 21-14, 11-21, 21-15తో హొర్బన్లుకిట్, బెన్యప (థాయ్‌లాండ్)ను ఓడించి టోర్నీలో ముందంజ వేసింది.
అంతకుముందు రోహన్ కపూర్, రుత్విక శివాని జంట.. 13-21, 19-21తో మలేషియాకు చెందిన ఎనిమిదో సీడ్ గొ సున్ హువాత్, లయ్ శెవాన్ జెమీ చేతిలో చిత్తైంది. మరో మ్యాచ్‌లో అషిత్ సూర్య, అమృత ప్రముథేశ్.. 16-21, 15-21తో వొంగ్ టైన్ చి, లిమ్ చ్యూ సీన్ (మలేషియా) జోరు ముందు తేలిపోయింది.