World Championships : ప్రపంచ వేదికలపై భారత ఆర్చర్లు మరోసారి సత్తా చాటారు. ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో కొన్నేళ్లుగా ఊరిస్తూ వస్తున్న పతకాన్ని సాధించారు. కాంపౌండ్ టీమ్ విభాగంలో దేశానికి తొలి పసిడి (Gold Medal) అందించింది పురుషుల బృందం. ఆదివారం జరిగిన ఫైనల్లో రిషభ్ యాదవ్, ప్రథమేశ్ ఫుగే, అమన్ సైనీల త్రయం ఫ్రాన్స్ ఆర్చర్లకు చెక్ పెట్టింది. హోరాహారీగా సాగిన పోరులో 235-233తో మన జట్టు విజయం సాధించింది.
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్స్లో మహిళల టీమ్ మహిళల టీమ్ ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. కాంపౌండ్ టీమ్ విభాగంలో నిరాశపరిచినా.. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో రెండో స్థానంతో రజతం కొల్లగొట్టింది. అయితే.. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో రిషబ్, ప్రథమేశ్, అమన్ బృందం మాత్రం పసిడితో మెరిసింది. ఫైనల్ తొలి రౌండ్లో 57-59తో వెనకబడినప్పటికీ ఒత్తిడికి లోనవ్వలేదు ఈ ముగ్గురు. చెక్కుచెదరని ఏకాగ్రతను కనబరిచి రెండో రౌండ్లో వరుసగా ఆరుసార్లు పది పాయంట్లు సాధించారు. దాంతో, 176-176తో స్కోర్లు సమం అయ్యాయి.
BREAKING: INDIA CREATE HISTORY 🏹
India’s 1st EVER GOLD medal in Compound Men’s team event at Archery World Championships 🔥
Trio of Rishabh, Prathamesh & Aman beat French pair 235-233 in Gold medal match.
📸 @worldarchery #Archery pic.twitter.com/k56cUQGOE3
— India_AllSports (@India_AllSports) September 7, 2025
నిర్ణయాత్మక మూడో రౌండ్లో ఫ్రాన్స్ ఆర్చర్ 9 పాయింట్లకే పరిమితం కాగా.. ప్రథమేశ్ గురి తప్పకుండా పది పాయింట్లు సాధించడంతో చరిత్రాత్మక గోల్డ్ మెడల్ వచ్చింది. తద్వారా పోడియంపై సగర్వంగా నిలబడిన ఈ త్రయం మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
‘ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్షిప్స్ ఫైనల్లో ప్రథమేశ్ ఒక్కడే కాదు.. ముగ్గురు ఆర్చర్లు గొప్ప ప్రదర్శన చేశారు. ఏమాత్రం ఒత్తిడిలోకి లోనవ్వకుండా లక్ష్యాన్ని గురి చూసి బాణం వదిలారు. సమిష్టిగా రాణించడంతో భారత్ ఖాతాలో పసిడి పతకం చేరింది’ అని చీఫ్ కాంపౌండ్ కోచ్ జివన్జ్యోత సింగ్ తేజా పీటీఐతో వెల్లడించాడు.
HISTORIC MOMENT! 🇮🇳🇮🇳
For only the 4th time in World Championship history, our National Anthem will echo! ✨✨
A proud moment for our RF athletes Prathmesh & Aman, who are making their mark in Indian Archery history! 🔥💪🏻 #RFathletes #RFsports #WorldArcheryChampionship pic.twitter.com/TWYSp4JdMA
— RelianceFoundationSports (@RFYouthSports) September 7, 2025