Harichand: మారథాన్ రన్నర్ హరిచంద్ కన్నుమూత
Hari chand was a two-time Olympian, also won two gold medals in Bangkok Asian Games. he passed away on Monday morning
భారత్ లో మారథాన్ రన్నర్ గా గుర్తింపు పొందిన ఒలింపియన్ హరిచంద్ కన్నుమూశారు. పంజాబ్ లోని హోషియార్పూర్ లో ఉంటున్న ఆయనకు 69 ఏండ్లు. 1953, ఏప్రిల్1న పంజాబ్ లోని ఘోరేవా అనే గ్రామంలో జన్మించిన హరిచంద్.. సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
మారథాన్ రన్నింగ్ లో హరిచంద్ భారత్ తరఫున పలు రికార్డులు సృష్టించారు. 1976, 1980 ఒలింపిక్స్ లలో హరిచంద్ భారత్ తరఫున అథ్లెటిక్స్ విభాగంలో పాల్గొన్నారు. 1976 ఒలింపిక్స్ లో 10వేల మీటర్ల పరుగు పందెంలో భారత్ తరఫున ఆయన నెలకొల్పిన (28:48.72) రికార్డు 32 ఏండ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంది.
1978 లో బ్యాంకాక్ లో జరిగిన ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో హరిచంద్ రెండు స్వర్ణ పతకాలు నెగ్గారు. 5వేల మీటర్లు, పది వేల మీటర్ల ఈవెంట్ లో ఆయన పసిడి పతకాలను ముద్దాడారు. భారత క్రీడాలోకానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనను అర్జున అవార్డుతో సత్కరించింది.
హరిచంద్ మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ నివాళి అర్పించారు. భారత అథ్లెటిక్స్ కు ఆయన గర్వకారణమని.. రాబోయే తరాలకు యువతకు మార్గదర్శిలా నిలుస్తారని తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

