న్యూఢిల్లీ: అండర్-23 ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రీకో-రోమన్ రెజ్లర్లు తొలి రోజే ఐదు పతకాలతో మెరిశారు. శనివారం జరిగిన పోటీల్లో సూరజ్ సింగ్, సాగర్ సింగ్ రజతాలు నెగ్గగా.. కుమార్ సచిన్, రోహిత్, హర్దీప్ కాంస్యాలు సాధించారు. 60 కేజీల విభాగం ఫైనల్లో సూరజ్ 0-4 తేడాతో కజకిస్తాన్‌కు చెందిన ఐబెక్ ఐట్బెకోవ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. 67 కేజీల విభాగంలోఫైనల్కు దూసుకెళ్లిన సాగర్ టైటిల్ ఫైట్‌లో 0-9తో ఖల్మాఖనోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలోఓడాడు. సచిన్ (77 కేజీ), రోహిత్ (97 కేజీ), హర్దీప్ (130 కేజీ) ఆయా విభాగాల సెమీఫైనల్స్‌లో ఓడి కాంస్యాలతో తిరిగొచ్చారు.