లండన్: బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌పై భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత ఘోరమైన ఎయిర్‌లైన్స్‌ను ఎప్పుడూ చూడలేదంటూ తన కోపాన్ని ఎక్స్ వేదికగా ప్రదర్శించాడు. ‘బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ పనితీరు చాలా దారుణంగా ఉంది. ఉద్యోగుల ప్రవర్తన అస్సలు బాగాలేదు. ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.
48 గంటలకు పైగా లగేజీ కోసం వేచిచూడటం చిరాకు వేస్తుంది’ అర్జున్ ట్వీట్ చేశాడు. సందేశాలు, మెయిల్స్, ఫామ్ లు ఇలా అన్ని రకాలుగా ప్రయత్నించినా ఎయిర్‌లైన్స్ సంస్థ నుంచి రెండు రోజులకు పైగా ఎలాంటి సమాచారం లేదు.. ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలో ఈ సంస్థలకు తెలియదనకుంటానని అర్జున్ తన పోస్టులో రాసుకొచ్చాడు.