హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ గ్రాండ్‌ప్రి-3లో తెలంగాణ యువ అథ్లెట్ గందె నిత్య స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 200మీటర్ల రేసును నిత్య..24.23సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచింది. కావేరి (కర్ణాటక, 24.38సె), అభినయ (తమిళనాడు, 24.39సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.