అమ్మాన్(జోర్డాన్): ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల 65కిలోల విభాగంలో బరిలోకి దిగిన సుజిత్ కల్కాల్..పాలస్తీనా రెజ్లర్ అబ్దుల్లా అసఫ్పై గెలిచినా..కైజీ తనాబే(జపాన్) చేతిలో ఎదుర్కొవాల్సి వచ్చింది.
తనాబే ఫైనల్ చేరినా గాయం కారణంగా సుజిత్ రెపిచేజ్లో ఆడే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మిగతా విభాగాల్లో విశాల్ కాళీరామన్(65కి), చిరాగ్(57కి), చంద్రమోహన్(79కి) ప్రత్యర్థుల చేతుల్లో ఓటములు ఎదుర్కొన్నారు.