ఢిల్లీ: భారత ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) చరిత్రలో మరో సంచలనం. స్లోవేనియాలోని లిపికా వేదికగా ఈ నెల 7 నుంచి 9 వరకూ జరిగిన త్రీ స్టార్ గ్రాండ్‌ప్రి ఈవెంట్లో భారత ఈక్వెస్ట్రియన్ శృతి వోరా చాంపియన్‌గా నిలిచింది.
మాగ్ననిమస్ (గుర్రం పేరు)తో కలిసి సీడీఐ-3 విభాగంలో శృతి 67.761 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రీడలో త్రీ స్టార్ గ్రాండ్‌ప్రి గెలిచిన తొలి ఈక్వెస్ట్రియన్‌గా శృతి రికార్డులకెక్కింది.