WBBL | మెల్బోర్న్: ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే ప్రతిష్టాత్మక మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో ఆరుగురు భారత క్రికెటర్లు ఆడనున్నారు. ఆదివారం వేలం ప్రక్రియ ముగియడంతో ఎవరెవరు ఏ జట్టుకు ఆడతారనేదానిపై స్పష్టత వచ్చింది. టీమ్ఇండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అడిలైట్ స్ట్రైకర్స్‌కు ఆడనుండగా దయాలన్ హేమలత పెర్త్‌కు ప్రాతినిథ్యం వహించనుంది. యస్తికా భాటియా, దీప్తి శర్మ మెల్బోర్న్ స్టార్స్ తరఫున బరిలోకి దిగనుండగా ఆల్‌రౌండర్ శిఖా పాండే, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ బ్రిస్బేన్ హీట్‌కు ఆడనున్నారు.