మాహె(సీషెల్స్): సీషెల్స్ నేషనల్ డే బాక్సింగ్ డే టోర్నీలో భారత బాక్సర్లు దుమ్మురేపారు. టోర్నీలో మూడు స్వర్ణాలు సహా మూడు రజతాలు, కాంస్యంతో అగ్రస్థానంలో నిలిచారు. సోమవారం జరిగిన వేర్వేరు బౌట్లలో హిమాంశు శర్మ(50కి) ప్రత్యర్థిపై వాకోవర్‌తో పసిడి గెలుచుకోగా, అశిష్(55కి) 4-1 తేడాతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
90+కిలోల విభాగంలో గౌరవ్ చౌహాన్ 3-2తో పసిడి ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు ఫైనల్లో ప్రత్యర్థుల చేతిలో ఓటములతో అన్మోల్(60కి), ఆదిత్యాయాదవ్(65కి), నీరజ్(75కి) రజతాలకు పరిమితమయ్యారు. పురుషుల 70కిలోల విభాగంలో కార్తీక్ దలాల్‌కు కాంస్యం దక్కింది.