సిడ్నీ: ఈ ఏడాది అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ కేవలం 25 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. దాంతో ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ టీ20 పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను సూర్యకుమార్ దాటేశాడు.
ఈ ఏడాది మహ్మద్ రిజ్వాన్ మొత్తం 19 ఇన్నింగ్స్ ఆడి 51.56 సగటుతో 825 పరుగులు చేసి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఇవాళ్టి ఇన్నింగ్స్‌తో కలిపి మొత్తం 25 ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ 41.28 సగటుతో 867 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు. కాగా, యాదవ్ 867 పరుగుల్లో ఒక సెంచరీ కూడా నమోదైంది.