హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాడ్మింటన్ చరిత్రలో తొలిసారి థామస్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుడైన తెలంగాణ స్టార్ షట్లర్ పంజాల విష్ణువర్ధన్గౌడ్ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. ఆదివారం అంబర్‌పేట ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ప్లే గ్రౌండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భారత జట్టు ప్రతిష్ఠాత్మక థామస్ కప్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించడం రాష్ర్టానికి గర్వాకారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.