హైదరాబాద్, ఆట ప్రతినిధి: నార్త్అమెరికా వేదికగా జరుగుతున్న పాన్ అమెరికన్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ గేమ్స్ టోర్నీలో తెలంగాణకు చెందిన జగ్జీవన్రెడ్డి, శ్యామల పతకాలతో మెరిశారు.
గురువారం జరిగిన పురుషుల జావెలిన్‌త్రో విభాగంలో జగ్జీవన్రెడ్డి 22.56మీటర్ల దూరం బరిసెను విసిరి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. మరోవైపు మహిళల షాట్‌పుట్‌లో శ్యామల 5.10మీటర్ల దూరంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.