Paris Olympics | భారత అథ్లెట్లు పారుల్ చౌదరీ, అంకితా దయానీ తీవ్రంగా నిరాశపరిచారు. శుక్రవారం జరిగిన మహిళల 5వేల మీటర్ల విభాగంలో బరిలోకి దిగిన పారుల్, అంకిత ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. హీట్-1లో పోటీపడ్డ పారుల్ 15:10.68 సెకన్ల టైమింగ్‌తో 14వ స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో తన పేరిట ఉన్న జాతీయ రికార్డు సవరించలేకపోయింది.
మరోవైపు హీట్స్-2లో అంకిత 16:19.38 సెకన్లతో 20వ స్థానంతో సరిపెట్టుకుంది. కిప్యోజెన్(కెన్యా), డేవిస్(ఆస్ట్రేలియా), గ్రోవ్డల్(నార్వే) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మరోవైపు పురుషుల షాట్‌పుట్‌లో భారత అథ్లెట్ తజిందర్పాల్సింగ్ తూర్ తన తొలి ప్రయత్నంలో 18.05 మీటర్లతో సరిపెట్టుకున్నాడు. స్టానెక్(21.61మీ) అగ్రస్థానంలో నిలిచాడు.