26 పట్టేశారు..
పారా ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్నారు. వైకాల్యాన్ని అధిగమించి బరిలోకి దిగి పతకాల మోతలో పోటీ పడుతున్నారు. గురువారం ఒక్క రోజే 7 స్వర్ణాలు సహా 26 పతకాలు తెచ్చారు. ఇందులో రెండు చేతులు లేకున్నా.. ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తున్న 19 ఏండ్ల యువ సంచలనం శీతల్ దేవి హైలైట్‌గా నిలిచింది. రెండు గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని తన ప్రతిభను మరోసారి చాటుకుంది.
- భారత్‌కు ఒక్క రోజే 26 మెడల్స్
- 2 స్వర్ణాలతో మెరిసిన ఆర్చర్ శీతల్
నగోయా (జపాన్): పారా ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు అసాధారణ ప్రతిభతో దూసుకుపోతున్నారు. వైకాల్యాన్ని అధిగమించి బరిలోకి దిగి పతకాల మోతలో పోటీ పడుతున్నారు. గురువారం ఒక్క రోజే 7 స్వర్ణాలు సహా 26 పతకాలు తెచ్చారు. ఇందులో రెండు చేతులు లేకున్నా.. ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తున్న 19 ఏండ్ల యువ సంచలనం శీతల్ దేవి హైలైట్‌గా నిలిచింది. రెండు గంటల వ్యవధిలో రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని తన ప్రతిభను మరోసారి చాటుకుంది. అథ్లెటిక్స్ విభాగం నుంచి ఒకే రోజు ఆరు స్వర్ణాలతో పతకాల ప్రవాహం కొనసాగడంతో భారత్ ఖాతాలో మొత్తం 88 మెడల్స్ చేరాయి. 21 స్వర్ణాలు, 26 రజతాలు, 41 కాంస్య పతకాలతో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
శీతల్ డబుల్ మ్యాజిక్
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ప్రపంచ పారా చాంపియన్ శీతల్ దేవి రెండు స్వర్ణాలతో మెరిసింది. పారా ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్‌లో తోమన్ కుమార్‌తో కలిసి బరిలోకి దిగిన శీతల్ 151-148తో ఇండోనేషియా జోడీ తియోడోరా ఆడి అయూడియా- కెన్ స్వాగుమిలాగ్పై విజయం సాధించి ఈ విభాగంలో స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత వ్యక్తిగత ఫైనల్లో తనదైన గురితో మెప్పించిన శీతల్ 142-139తో సియాహిదా (సింగపూర్)ను ఓడించి మరో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆర్చరీ డబ్ల్యూ 1 విభాగం ఫైనల్లో ఓడిన స్వాతి చౌదరి రజతం సాధించి ఈ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించిన ఆర్చర్‌గా రికార్డు సృష్టించింది.

అథ్లెటిక్స్‌లో అదుర్స్
అథ్లెటిక్స్‌లో భారత పరుగు వీరుల హవా నడుస్తోంది. పురుషుల హై జంప్ టీ63 విభాగంలో శైలేష్ కుమార్ నేతృత్వంలో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఫైనల్లో శైలేష్ 1.89 మీటర్ల ఎత్తును అధిగమించి గేమ్స్ రికార్డుతో దేశానికి పసిడి అందించాడు. వరుణ్ భాటి (1.84 మీ), రాహుల్ (1.81 మీ) రజతం, కాంస్యం సాధించారు. స్ప్రింటర్లు అంజనాబెన్ బంబడియా, దిలీప్ మహదు గావిట్ కూడా సత్తా చాటారు. మహిళల 400మీ టీ47 విభాగంలో అంజనాబెన్ (59.97 సె), జయంతి బెహెరా (1:00.65 సె) స్వర్ణం, రజతం గెలిచారు.
గావిట్ పురుషుల 400మీ టీ47 రేసును 48.27 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ గెలుచుకున్నాడు. మహిళల డిస్కస్ త్రో ఎఫ్54 విభాగంలో సువర్ణ రాజ్ 15.66 మీటర్ల ప్రయత్నంతో స్వర్ణం ఖాతాలో వేసుకుంది. వీల్‌చైర్ పరిమితం అయిన 44 ఏండ్ల సువర్ణ తన నాలుగు ప్రయత్నాల్లోనూ 15 మీటర్లను అధిగమించడం విశేషం. ఇక, లాంగ్ జంపర్ ధర్మరాజ్ సోలైరాజ్ టీ44/టీ62/టీ64 విభాగాల కలయికతో జరిగిన పోటీలో 7.15 మీటర్ల దూరాన్ని అధిగమించి, ఆసియా రికార్డును నెలకొల్పుతూ బంగారు పతకాన్ని నిలబెట్టుకున్నాడు. మహిళల 400మీ టీ12 విభాగంలో దృష్టి లోపం ఉన్న తేజల్బెన్ దామోర్ (57.60 సె) సిల్వర్ నెగ్గింది. పారా అథ్లెటిక్స్ విభాగం ఒక్కటే భారత్‌కు ఇప్పటికి 18 స్వర్ణాలతో కలిపి మొత్తం 52 పతకాలను అందించింది.

High Jump
ఏపీ స్విమ్మర్ రవి హ్యాట్రిక్.. కొలనులోనూ జోరు
స్విమ్మింగ్ పూల్‌లోనూ భారత క్రీడాకారులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ టీనేజ్ పారా స్విమ్మర్ రవి బుడిగిన పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఎస్13 విభాగంలో కాంస్యం సాధించి టోర్నమెంట్లో హ్యాట్రిక్ పతకాలు పూర్తి చేసుకున్నాడు. దృష్టి లోపం ఉన్న 18 ఏండ్ల రవి 25.89 సెకండ్ల టైమింగ్‌తో కాంస్యం నెగ్గాడు. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఎస్10 విభాగంలో కపిల్ ( 4:38.44సె) రెండో స్థానంతో రజతం నెగ్గగా, పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఎస్బీ9 విభాగంలో స్వాతిక్ (1:13.77 సె), ఎస్7 ఈవెంట్లో తేజస్ (1:18.58సె) కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు.
బ్యాడ్మింటన్‌లో మెరుపులు
బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3 సెమీఫైనల్లో పారా ఆసియా చాంపియన్ ప్రమోద్ భగత్ 2 గంటల 9 నిమిషాల మారథాన్ పోరులో 16-21, 21-18, 21-17తో లీ సియోంగ్హు (కొరియా) ఓడించి ఫైనల్ చేరాడు. తుది పోరులో అతను మరో భారత షట్లర్ నితేష్ కుమార్‌తో తలపడనున్నాడు. నవీన్ శివకుమార్ (పురుషుల సింగిల్స్ ఎస్ఎల్4) కూడా ఫైనల్లో అడుగు పెట్టగా.. నితేష్ కుమార్ సింగిల్స్‌తో పాటు మిక్స్డ్ డబుల్స్ లో తులసిమతి మురుగేశన్‌తో కలిసి ఫైనల్‌కు చేరుకుని రెండు స్వర్ణాల రేస్‌లో నిలిచాడు. ఇక, టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ 7 విభాగంలో భవినా పటేల్- శుభమ్ వాధ్వా జోడీ సెమీఫైనల్లో పోరాడి కాంస్య పతకంతో సంతృప్తి చెందింది.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

