అంటల్య: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్ల పతకాల వేట కొనసాగుతోంది. ఆదివారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పోరులో ధీరజ్ బొమ్మదేవర, భజన్ కౌర్ ద్వయం.. 5-3తో మెక్సికన్ ఆర్చర్లు వలెన్సియ-గ్రాండెపై విజయం సాధించారు. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లోనూ 22 ఏండ్ల ధీరజ్.. 7-3తో నెస్పొలి (ఇటలీ)పై గెలిచి కాంస్యం సాధించాడు. ఈ టోర్నీలో భారత్కు ఇది నాలుగో పతకం.