అంటల్య: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 3 పోటీలలో భారత రికర్వ్ ఆర్చర్లు పతకాలు సాధించడంలో విఫలమైనా పారిస్ ఒలింపిక్ బెర్తులను దాదాపుగా ఖాయం చేసుకున్నారు. మహిళల విభాగంలో దీపికా కుమారి, భజన్, అంకితాతో కూడిన త్రయం.. సెమీస్‌లో 4-5తో ఫ్రాన్స్ చేతిలో ఓటమిపాలైంది. కాంస్య పోరులో జపాన్ 6-0తో భారత్‌కు పరాభవం తప్పలేదు.
ఇక ధీరజ్, తరుణ్‌దీప్, ప్రవీణ్‌తో కూడిన పురుషుల జట్టు సైతం క్వార్టర్స్‌లో 1-5తో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. కాగా రికర్వ్ ఆర్చర్ల నిరాశపరిచినా ఈ నెల 25న విడుదల కాబోయే ర్యాంకింగ్స్‌ను బట్టి పారిస్ బెర్తులు ఖరారు అవుతాయి. కొత్త నిబంధనల ప్రకారం.. ఒలింపిక్ బెర్తులు ఖాయం కాని జట్లలో టాప్-2 టీమ్స్‌కు కోటా దక్కుతుంది.