Denmark Open 2024 : నిరుడు ఒక్కటంటే ఒక్క టైటిల్ గెలవని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) మళ్లీ ఓడిపోయింది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం విరామం తీసుకున్న సింధు అర్కిటిక్ ఓపెన్ (Arctic Open)లో నిరాశపరిచింది. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక డెన్మార్క్ ఓపెన్ (Denmark Open 2024) నుంచి కూడా నిష్క్రమించింది.
16వ రౌండ్లో నాలుగో సీడ్‌ను ఓడించి టైటిల్ దిశగా ముందడుగు వేసిన సింధు క్వార్టర్ ఫైనల్లో జోరు చూపలేక ఓడిపోయింది. ఒలింపిక్ పతకం విజేత జార్జియా మరిస్కా తనుజుంగ్ (Greogria Mariska Tunjung) చేతిలో భారత షట్లర్ పరాజయం పాలైంది.
Pusarla V. Sindhu 🇮🇳 takes on No.5 seed Gregoria Mariska Tunjung 🇮🇩.#BWFWorldTour #DenmarkOpen2024 pic.twitter.com/wi7edikovN
— BWF (@bwfmedia) October 18, 2024
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సింధు సత్తా చాటలేకపోయింది. విశ్వ క్రీడల్లో కాంస్యం గెలుపొందిన జార్జియా ధాటికి నిలువలేక 13-21, 21-16, 9-21తో మ్యాచ్ చేజార్చుకుంది. తొలి సెట్‌ను కోల్పోయిన సింధు రెండో సెట్లో పుంజుకుంది. కోర్టులో చురుగ్గా కదిలి ప్రత్యర్థికి షాకిస్తూ సెట్ గెలుచుకుంది. కాన,ఈ నిర్ణయాత్మక మూడో సెట్లో మాత్రం జార్జియా చెలరేగింది. సింధు పరాజయంతో డెన్మార్క్ ఓపెన్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.