కోల్‌కతా: భారత వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 40 టెస్టులు ఆడిన సాహా.. ఈ ఏడాది రంజీ సీజన్ తనకు ఆఖరిదని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించాడు. ‘అద్భుత క్రికెట్ ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది.
ఈ రంజీ సీజనే నాకు చివరిది. బెంగాల్ తరఫున చివరి సారి ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సీజన్‌ను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకుంటా’ అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.