INDW vs SAW : భారత మహిళల జట్టు టీ20 సిరీస్ సమం చేసేందుకు సిద్దమైంది. తొలి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. టాస్ గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ తీసుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఒక్క మార్పు చేసింది. తలకు గాయం కారణంగా వికెట్ కీపర్ రీచా ఘోష్ ఆడడం లేదన ఆమె స్థానంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఉమ ఛెత్రి(Uma Chetry) అరంగేట్రం చేయనుందని కౌర్ తెలిపింది. మరోవైపు పర్యాటక జట్టు ఏ మార్పులు లేకుడా ఆడుతోంది
భారత జట్టు : షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), ఉమ ఛెత్రి (వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, ఆశా శోభన, రేణుకా సింగ్.
దక్షిణాఫ్రికా జట్టు : లారా వొల్వార్డ్త్(కెప్టెన్), తంజిమ్ బిష్త్, మరిజానే కాప్, అన్నెకె బొస్చ్, కొలె ట్రయాన్, నడినె డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, ఎలిజ్ మరి మార్క్స్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), అయబొంగ ఖాక, నొనుకెలెలెకొ లబా.